Buffalo Climbs Onto House: నిరాలలో ఇంటిపైకి ఎక్కిన ఎద్దు
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:29 AM
ఓ ఎద్దును కుక్కలు తరమడంతో ఆ ఎద్దు ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని నిరాల గ్రామంలో జరిగింది....
జైనథ్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఓ ఎద్దును కుక్కలు తరమడంతో ఆ ఎద్దు ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని నిరాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన షేక్‌గఫూర్ అనే రైతు తన ఎద్దును ఇంటి ఆరు బయట కట్టేసి ఉంచగా ఆదివారం ఉదయం ఓ కుక్కల గుంపు ఆ ఎద్దును తరమడంతో అది పరుగెత్తి పక్కనున్న రాళ్లకట్టపై నుంచి ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కింది. దీంతో గ్రామానికి చెందిన విఠల్ మాస్టర్ పెంకుటిల్లు పైభాగం కొంత ధ్వంసమయింది. అది గమనించిన ఆయన చివరకు రైతుల సాయంతో ఎద్దును కిందకి దించారు.