BSNL to Launch Triple Play Services: రాష్ట్రంలో ట్రిపుల్ ప్లే సేవలు ప్రారంభించనున్న బీఎస్‌ఎన్‌ఎల్
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:15 AM
రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకే ట్రిపుల్ ప్లే(ఎ్‌ఫటీటీహెచ్) సేవలను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభించనుంది. ....
రూ. 299కే ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, ఫైబర్‌టీవీ సేవలు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకే ట్రిపుల్ ప్లే(ఎ్‌ఫటీటీహెచ్) సేవలను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) ప్రారంభించనుంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని, రూ. 299 నుంచి ధరలు ప్రారంభమవుతాయని సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్యాకేజీ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత టెలిఫోన్ కాలింగ్, అనేక ఛానెళ్లను అందించే ఫైబర్ టీవీ వంటి మూడు సేవలు ఒకే కనెక్షన్ ద్వారా పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాలకు కూడా అధునిక డిజిటల్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని సంస్థ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అన్నారు. ఇక, నగర వినియోగదారుల కోసం ఐపీటీవి, ఫైబర్ టీవీ వంటి ఆడ్-ఆన్ ప్యాకేజీలు కూడా బీఎ్‌సఎన్‌ఎల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలలో స్కైప్రో, స్మార్ట్ ప్లే టీవీ, ఉల్కా టీవీ వంటి ఓటీటీ సేవలు ఉంటాయని అధికారులు తెలిపారు.