MP Arvind: వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ ఉండదు
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:18 AM
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎ్‌సఉనికి ఉండబోదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పారు. ఈ విషయాన్ని తాను స్టాంప్ పేపర్‌పై రాసిస్తానని ప్రకటించారు....
మీడియాతో చిట్‌చాట్‌లో ఎంపీ అర్వింద్
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎ్‌సఉనికి ఉండబోదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పారు. ఈ విషయాన్ని తాను స్టాంప్ పేపర్‌పై రాసిస్తానని ప్రకటించారు. బీఆర్‌ఎస్ నాయకులందరూ బీజేపీలో చేరతారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. ఎన్నేళ్లు తపస్సు చేసినా కేటీఆర్ సీఎం కాలేరని స్పష్టం చేశారు. సోమవారం అర్వింద్ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. వచ్చే ఎన్నికలు జమిలి అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కవిత.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని చెప్పారు. ‘‘నిజామాబాద్ జిల్లా కోడలిగా కవితను భావిస్తూ ఆమె శ్రేయోభిలాషిగా చెబుతున్నా.. కొత్త పార్టీ ఏర్పాటు చేయవద్దని ఆమెను కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిదే అని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జడ్పీ చైర్మన్ పీఠాన్ని తాము గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.