Government whip Beerla Ailayya: అసమర్థుని జీవయాత్రలా కేటీఆర్ టూర్లు
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:46 AM
కేటీఆర్ జిల్లా టూర్లు అసమర్థుని జీవయాత్రను తలపిస్తున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా...
పంచాయతీ ఎన్నికల్లో ఓడినా విజయోత్సవాలా..?: బీర్ల
సీఎం రేవంత్ దెబ్బకు కేటీఆర్ మైండ్ బ్లాంక్: ఆది
హైదరాబాద్/వనపర్తి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్ జిల్లా టూర్లు అసమర్థుని జీవయాత్రను తలపిస్తున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినా విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పర్యటనలకు వెళ్తున్న కేటీఆర్‌ను చూస్తుంటే జాలేస్తోందన్నారు. గెలిచిన సర్పంచ్‌లను కాపాడుకోవడం కోసం కేటీఆర్ తెగ తాపత్రయపడుతున్నాడన్నారు. కవిత ఒకవైపు, హరీశ్ రావు మరోవైపు.. బీర్‌ఎ్‌సకు గుండు కొట్టే పనిలో ఉన్నారని, కేటీఆర్ ముందుగా తన పార్టీని కాపాడుకోవాలని సూచించారు. కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిపై మరోమారు ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ దెబ్బకు కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ చాచి కొడితే ఫాంహౌ్‌సలో పడింది ఎవరో అందరికీ తెలుసన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కాదని ఇతర పార్టీల అభ్యర్థులకు పరోక్షంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సహకరించారంటూ కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మండిపడ్డారు. దీనిపై పూర్తి ఆధారాలతో పార్టీ అధిష్ఠానం ఏఐసీసీ, పీసీసీ క్రమశిక్షణా కమిటీలకు త్వరలోనే ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వబీఆర్‌ఎస్ గెలిచిన 10 నుంచి 15 స్థానాల్లో చిన్నారెడ్డి హస్తం పరోక్షంగా ఉందని వ్యాఖ్యానించారు.
నేడు ఎంజీ రోడ్‌లో కాంగ్రెస్ ధర్నా..
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా శనివారం సికింద్రాబాద్ ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ఇందులో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. అలాగే ఆదివారం అన్ని జిల్లా కేంద్రాల్లోనూ గాంధీజీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.