Minister N. Uttam Kumar Reddy: సెక్యులర్ ఓట్లను చీల్చి బీజేపీని బలపరచడమే బీఆర్‌ఎస్ పని
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:10 AM
సెక్యులర్ ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ ఎదుగుదలకు బీఆర్‌ఎస్ పాటుపడుతోందని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు...
మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సెక్యులర్ ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ ఎదుగుదలకు బీఆర్‌ఎస్ పాటుపడుతోందని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ ఒక్కటే సెక్యులర్ పార్టీ అని, తెలంగాణలోనూ, దేశంలోనూ బీజేపీని ఓడించేది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం యూసు్‌ఫగూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా జరిగిన మైనార్టీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలాగే అవకాశవాద విధానాలు బీఆర్‌ఎస్ అనుసరిస్తోందని విమర్శించారు. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలపడతాయో అక్కడ కాంగ్రెస్ బలహీనపడి, బీజేపీ బలపడే అవకాశముందన్నారు. రాష్ట్రంలో 80శాతానికి పైగా మైనార్టీ విద్యాసంస్థలు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మూతపడ్డాయన్నారు. ప్రజాప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడుతోందని, ఏటా రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ను మైనార్టీల అభివృద్ధికోసం కేటాయించామని చెప్పారు. ఉప ఎన్నికలో మైనార్టీ ఓటర్లు నవీన్‌యాదవ్‌ను బలపరచాలని కోరారు. కాంగ్రె్‌సకు పడే ప్రతీ ఓటు లౌకిక భారత భావజాలానికి సమర్థన అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ అలీ షబ్బీర్, ఎంపీలు కడియం కావ్య, అనిల్‌కుమార్ మాజీ ఎమ్మెల్యే సంపత్ తదితరులు పాల్గొన్నారు.