Share News

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:02 PM

నియోజకవర్గంలోని పలువురు బీఆర్‌ఎస్‌ నా యకులు పార్టీని వీడి శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

అచ్చంపేటటౌన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని పలువురు బీఆర్‌ఎస్‌ నా యకులు పార్టీని వీడి శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉప్పు నుంతల మండల పరిధిలోని గువ్వలోనిపల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ రఘు, మాజీ డిప్యూటీ సర్పంచ్‌ రేవల్లి వెంకటయ్యతో పాటు గ్రామా నికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్నివిధాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజా పాలనను చూసి పలువురు పార్టీలోకి వచ్చారని తెలిపారు. అత్యధిక స్థానాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. కార్యక్ర మంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:02 PM