BRS Leaders Blame: బీఆర్‌ఎస్‌లో సమన్వయలోపం.. కాంగ్రెస్ అక్రమాల వల్లే ఓటమి
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:40 AM
సొంత పార్టీలోని కొందరు నాయకులు, కార్యకర్తలు.. కాంగ్రె్‌సకు కోవర్టులుగా పనిచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం.. కాంగ్రెస్ చేసిన అక్రమాల వల్లే జూబ్లీహిల్స్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు.....
డివిజన్ ఇన్‌చార్జ్జులకు చెప్పినా పట్టించుకోలేదు: జూబ్లీహిల్స్ ఫలితంపై బీఆర్‌ఎస్ కార్యకర్తల అభిప్రాయం
కాంగ్రెస్ దొంగ ఓట్లు వేయించింది
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధంకండి: కేటీఆర్
సమష్టి కృషితో కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేసుకుందాం: హరీశ్
హైదరాబాద్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘సొంత పార్టీలోని కొందరు నాయకులు, కార్యకర్తలు.. కాంగ్రె్‌సకు కోవర్టులుగా పనిచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం.. కాంగ్రెస్ చేసిన అక్రమాల వల్లే జూబ్లీహిల్స్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు.ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ డివిజన్ ఇన్‌చార్జులకు తెలియజేస్తే ఒక్కరూ రాలేదు’ అని ఆ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఉపఎన్నికలో ఓటమికి కారణాలపై సమీక్షలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, పలువురు ఎమ్మెల్యేలు, ఉపఎన్నిక డిజివిజన్ల ఇన్‌చార్జులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా.. అధికార కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కై.. పక్కరాష్ట్రం కర్ణాటకనుంచి మనుషులను రప్పించి దొంగ ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. షేక్‌పేట, ఎర్రగడ్డ వంటి ప్రాం తాల్లో రిగ్గింగ్ చేశారని, పోలీసులను అడ్డంపెట్టుకొని, డబ్బు, మద్యం పంచి అనైతికంగా గెలిచారని విమర్శించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీశ్రేణులు పనిచేయాలని సూచించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకోసం నేటి నుంచే పార్టీశ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ, ఇతరఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా.. కార్యకర్తలను సమన్వయం చేసుకొని పార్టీశ్రేణులు సమష్టిగా పనిచేసి కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేసుకుందామన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభు త్వమేనని, బీఆర్‌ఎస్ శ్రేణులను ఇబ్బంది పెట్టినవారిని వదిలేప్రసక్తేలేదని హెచ్చరించారు.