Share News

Minister Seethakka: స్థానిక ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ సర్కార్‌

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:34 AM

స్థానిక సంస్థల్లో పాలకవర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలయినా.. ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని, దీనికి బాధ్యత వహిస్తూ పంచాయతీరాజ్‌...

Minister Seethakka: స్థానిక ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ సర్కార్‌

  • మంత్రి సీతక్క రాజీనామా చేయాలి: బీఆర్‌ఎస్‌

స్థానిక సంస్థల్లో పాలకవర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలయినా.. ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని, దీనికి బాధ్యత వహిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ నేతలు క్యామ మల్లేశ్‌, వై.సతీ్‌షరెడ్డి మంగళవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పాలక వర్గాల్లేక గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఎన్నికలు నిర్వహించలేని.. ఈ ప్రభుత్వంలో మంత్రులుగా ఏం చేస్తున్నారని, పదవులను వదులుకోవడమే మంచిదని వారు సూచించారు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసినా.. ఎన్నికలు నిర్వహించకుండా రేవంత్‌రెడ్డి సామంతరాజులను నియమిస్తారా? అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఎన్నికలకు వెళ్లడం లేదని, బీసీ రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ తప్పించుకుంటున్నారని వారు ఆరోపించారు.

Updated Date - Sep 24 , 2025 | 03:34 AM