Share News

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌లకు బుద్ధి చెప్పాలి

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:43 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు ఒక్కటేనని జూబ్లీహిల్స్‌ ప్రజలు ఓటుతో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని కేంద్రమంత్రి...

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌లకు బుద్ధి చెప్పాలి

  • ఆ మూడు పార్టీలూ ఒక్కటే : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • కాంగ్రె్‌సకు అసదుద్దీన్‌ మద్దతు.. ఆయన తమ్ముడు బీఆర్‌ఎ్‌సకు.. : సంజయ్‌

  • రాష్ట్రాన్ని మార్పు వైపు తీసుకెళ్లే ఈ ఎన్నిక చాలా కీలకం : రాంచందర్‌ రావు

  • జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

యూసు్‌ఫగూడ/హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు ఒక్కటేనని జూబ్లీహిల్స్‌ ప్రజలు ఓటుతో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక్కటేనని ఆరోపించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి మజ్లిస్‌ పార్టీ, అసదుద్దీన్‌ ఒవైసీ మద్దతు ఉందన్నారు. మజ్లిస్‌ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌ను రక్షించుకోవాలన్నారు. నాడు కేసీఆర్‌ మజ్లి్‌సను తన భుజాల మీద మోసారని, నేడు కాంగ్రెస్‌ కూడా అదే చేస్తోందని ధ్వజమెత్తారు. ఆ మూడు పార్టీలు స్వార్థం కోసమే పని చేస్తాయని ఆరోపించారు. బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్టేనని, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ను సింగపూర్‌, వాషింగ్టన్‌ చేస్తానని చెప్పి ఇప్పుడు ఫామ్‌హౌ్‌సలో ఉన్నార ని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వీధి దీపాలు ఏర్పాటుకూ ఇబ్బంది పడుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రె్‌సకు జూబ్లీహిల్స్‌లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉండే దీపక్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ కిషన్‌ రెడ్డి అడ్డా అని, ఆయన నాయకత్వంలో ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.


ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి అసదుద్దీన్‌ మద్దతిస్తే, ఆయన తమ్ముడు బీఆర్‌ఎ్‌సకు వత్తాసు పలుకుతున్నాడని విమర్శించారు. బీజేపీని ఓడించేందుకు దేశమంతా పోటీ చేస్తున్న మజ్లిస్‌.. జూబ్లీహిల్స్‌లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ కాంగ్రెస్‌ గెలిస్తే బంజారాహిల్స్‌ పెద్దమ్మతల్లి స్థలాన్ని మజ్లి్‌సకు ధారాదత్తం చేసేలా ఒప్పందం జరిగిందని ఆరోపించారు. అలాగని కాంగ్రె్‌సపై కోపంతో బీఆర్‌ఎస్‌కు ఓట్లేస్తే ఇక అంతే సంగతులని పేర్కొన్నారు. ఈ ఉపఎన్నికలో బీజేపీ, మజ్లిస్‌ మధ్యే ప్రధాన పోటీ అన్నారు. ఇక, రాష్ట్రాన్ని మార్పు వైపు తీసుకెళ్లే పాలన కోసం ఈ ఉపఎన్నిక ఎంతో కీలకమని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడంలో గతంలో ఏ ప్రభుత్వమూ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. హైదరాబాద్‌లోని కాలనీల్లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల, రఘునందన్‌ రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్‌ శంక ర్‌, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, ఏవీఎన్‌ రెడ్డి, నేతలు కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్‌ పాల్గొన్నారు. కాగా, బీజేపీ ర్యాలీలో టీడీపీ జెండాలు కూడా కనిపించాయి.

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో 40 మంది

జుబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారానికి బీజేపీ 40 మంది నేతలతో స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, నిర్మలా సీతారామన్‌, బండి సంజయ్‌, అర్జున్‌రాం మేఘవాల్‌, శ్రీనివాస్‌ వర్మ, రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌శర్మ, ఎంపీలు లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, తేజస్వి సూర్య, ధర్మపురి అర్వింద్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య, జి.నగేశ్‌, పురందేశ్వరి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిలు సునీల్‌ బన్సల్‌, అభయ్‌పాటిల్‌, సీనియర్‌ నాయకులు గరికపాటి మోహన్‌రావు,, కె. అన్నామలై, బి. వెంకటేశ్‌ నేత, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, మురళీధర్‌రావు, బూర నర్సయ్యగౌడ్‌, మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, టి. వీరేందర్‌గౌడ్‌, ఎన్‌.గౌతంరావు, వేముల అశోక్‌, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌, మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్యే సుజనాచౌదరి, తెలంగాణ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాయల్‌ శంకర్‌, సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు వెంకటనారాయణరెడ్డి, కొమురయ్య, అంజి రెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాకు ఎన్నికల అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది.

Updated Date - Oct 22 , 2025 | 04:43 AM