బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:05 PM
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ రెండు ఒక్కటేనని చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని జవాబు చెప్పాలని రా ష్ట్ర కార్మిక ఉపాధికల్పన గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. రా ష్ట్రంలో తమ ప్రభుత్వం 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉందన్నారు. శనివారం మందమర్రిలో బీసీ సంఘాలు నిర్వహించిన ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ముందుగా ఆయన మార్కెట్ సెంటర్‌లో జ్యోతిరావుఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులు ఆర్పించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నాం
కేంద్రం ఆర్టికల్ 9తో రిజర్వేషన్‌లు అమలు చేయాలి
మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి
మందమర్రిటౌన్,అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ రెండు ఒక్కటేనని చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని జవాబు చెప్పాలని రా ష్ట్ర కార్మిక ఉపాధికల్పన గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. రా ష్ట్రంలో తమ ప్రభుత్వం 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉందన్నారు. శనివారం మందమర్రిలో బీసీ సంఘాలు నిర్వహించిన ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ముందుగా ఆయన మార్కెట్ సెంటర్‌లో జ్యోతిరావుఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను మొదటి నుంచి వ్య తిరేకిస్తుంది బీఆర్‌ఎస్ పార్టీ అని ఈ విషయాన్ని బీసీలంతా గమనించాలన్నారు. మొదట అసెంబ్లీలో ఏకగ్రీవంగా రిజర్వేషన్ల కోసం ఆమోదించిన ఏకైక ప్రభుత్వం తమ ప్రభుత్వమే అని తెలిపారు. దీనికి సంబంధించి గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా నిలిపి వేశారని పేర్కొన్నారు. కోర్టులు కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించడం విచారకరమన్నారు. అంతేగాకుండా తమిళనాడు ప్రభుత్వం ఆర్టికల్ 9ని అనుసరించి రిజర్వేషన్లను అమలు చేసిందన్నారు. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి సంబంధించిన బీసీ బిల్లును ఆమోదం తెలిపితే బాగుం టుందన్నారు. కానీ తమ ప్రభుత్వానికి ఎక్కడ ఈ రిజర్వేషన్లను అమలు చేస్తే తమ ప్రభుత్వా నికి ఆదరణ పెరుగుతుందోనని కేంద్రం ముందుకు రావడం లేదన్నారు. ఈ బందుతోనైన కేంద్రం కల్లు తెరవాలన్నారు. ఈ రిజర్వేషన్లను ఆమోదించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నిక లు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అనంతరం మార్కెట్ సెంటర్ నుంచి ర్యాలీ దుకాణ సముదాయాల మీదుగా కోల్ బెల్ట్ రోడ్డు వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘా ల నాయకులు బీసీ పట్టణ జిల్లా నాయకులు చకినాల శంకర్, పోలు శ్రీనివాస్, కొండిల్ల శ్రీనివాస్, బి. సదానందం,సతీష్, కిరణ్, శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.