Minister Ponguleti Srinivas Reddy: అబద్ధాలు చెప్పడంలో బీఆర్‌ఎస్, బీజేపీ పోటీ!
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:11 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు తఽథ్యమని తెలిసి బీఆర్‌ఎస్, బీజేపీ అబద్ధాలతో పోటీపడుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్...
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి వ్యాఖ్య
మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
హైదరాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు తఽథ్యమని తెలిసి బీఆర్‌ఎస్, బీజేపీ అబద్ధాలతో పోటీపడుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంత్రి సమక్షంలో రెహ్మత్‌నగర్ డివిజన్‌లోని వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు కాంగ్రె్‌సలో చేరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, బీఆర్‌ఎస్ అబద్ధాలకు మధ్య జరుగుతున్న యుద్ధమని పొంగులేటి చెప్పారు. గత పదేళ్లలో ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు వేలాది కోట్లు ఖర్చు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు నియోజకవర్గంలో రూ.400 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, 14వేల కొత్త రేషన్ కార్డులు వచ్చాయని చెప్పారు. సన్నబియ్యంలో సగం ఖర్చు కేంద్రానిదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారని, అలాంటప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు సన్నబియ్యం ఇవ్వడం లేదని పొంగులేటి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీ చెప్పే అవాస్తవాలను ప్రజలు నమ్మరని, ఈనెల 11న జరిగే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు.