Minister Ponguleti Srinivas Reddy: బీఆర్‌ఎస్, బీజేపీ ఒకే తాను ముక్కలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:49 AM
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్‌ఎస్ నాయకులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు...
గత పార్లమెంట్ ఎన్నికల నుంచి పొత్తు: పొంగులేటి
బోరబండ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్‌ఎస్ నాయకులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్‌హిల్స్ బస్తీల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఓకే తాను ముక్కలేనని ఎద్దేవా చేశారు. గత పార్లమెంటు ఎన్నికల నుంచి ఆ పార్టీల మధ్య పొత్తు ఉందని ఆరోపించారు. గతంలో దివంగత సీఎల్పీ మాజీనేత పీజేఆర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఇంతవరకు మళ్లీ అటువంటి అభివృద్ధే జరగలేదని అన్నారు. పదేళ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేయలేని బీఆర్‌ఎస్ నేతలు.. కేవలం 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ సరిపోల్చడం వారి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఉపఎన్నికల తర్వాత తాను ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి పేదలకు ఇండ్లపట్టాలు, ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నేతల చెంప చెళ్లుమనేలా కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీఆర్ హిల్స్ ప్రాంతంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన వందమంది మైనార్టీ యువకులకు, మరో వంద మంది మహిళలకు మంత్రి పొంగులేటి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.