kumaram bheem asifabad- తల్లి పాలతోనే బిడ్డకు ఆరోగ్యం
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:35 PM
తల్లి పాలతోనే పుట్టిన బిడ్డకు ఆరోగ్యంగా ఉం టుందని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లత అన్నారు. మండలంలోని బంబర గ్రామలో బుధవారం తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ మొదటి ఆరు నెలలు తల్లి పాలు బిడ్డకు శ్రేష్టమైదని అన్నారు.
వాంకిడి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తల్లి పాలతోనే పుట్టిన బిడ్డకు ఆరోగ్యంగా ఉం టుందని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లత అన్నారు. మండలంలోని బంబర గ్రామలో బుధవారం తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ మొదటి ఆరు నెలలు తల్లి పాలు బిడ్డకు శ్రేష్టమైదని అన్నారు. రొమ్ము లోపల యాంటీబాడీస్, విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయన్నారు. బిడ్డకు తల్లి పాలు ఇవ్వడంవల్ల శిశువులో మెదడు పెరుగుదలకు సహకరిస్తుందని, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో పోషన్‌అభియాన్ కోఆర్డినేటర్ తౌఫిక్, అంగన్‌వాడీ టీచర్లు సువర్ణ, సరిత, ఏఎన్‌ఎం సునంద, ఆశా వర్కర్ లక్ష్మి పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): తల్లిపాలలో పోషకాలు అధికంగా ఉంటాయని పంచాయతీ కార్యదర్శి హరీష్ అన్నారు. మండలంలోని గుండి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బిడ్డ పుట్టిన గంటలోపు వచ్చే ముర్రుపాలను పిల్లలకు పట్టించాలన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి సక్రమంగా టీకాలు వేయిస్తూ వారి ఆరోగ్యానికి భద్రత కల్పించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాలింతలకు, గర్భిణులకు పౌష్ఠికాహరం అందజేశారు. కార్యక్రమంలో హెచెం కవిత, అంగన్‌వాడీ టీచర్లు పద్మ, పెంటుబాయి, విజయలక్ష్మి, ఏఎన్‌ఎం సంగీత, ఆశ వర్కర్ దేవి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): చిన్నారులకు తల్లి పాలు ఎంతో ముఖ్యమని జైనూర్ సీడీపీవో ఇందీర అన్నారు. మండలంలోని గూడామామడాలో ఏర్పాటు చేసిన తల్లి పాల వారోత్స వాల్లో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం సేవంత, ఆశా వర్కర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.