kumaram bheem asifabad- ‘అంగన్‌వాడీ’ల్లో అల్పాహారం
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:16 PM
పిల్లలకు అంగ న్‌వాడీ కేంద్రాల్లో అల్పాహారం అందించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ పోషకాహారం అందిస్త్తోంది. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తోంది. కేంద్రా లను మరింత బలోపేతం చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.
- చిన్నారుల హాజరు పెంపునకు దోహదం
రెబ్బెన, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు అంగ న్‌వాడీ కేంద్రాల్లో అల్పాహారం అందించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ పోషకాహారం అందిస్త్తోంది. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తోంది. కేంద్రా లను మరింత బలోపేతం చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. కేంద్రాల్లో మరో కొత్త పథకం అమలుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఒక పూట(మధ్యాహ్నం) మాత్రమే చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారం క్రితం మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగర పరిధిలోని 139 అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ఈపథకం అమలు చేస్తోంది. మెరుగైన ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
- ఐదు ఐసీడీఎస్ సెక్టార్ల పరిధిలో
జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ సెక్టార్ల పరిధిలో 973 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 3-6 ఏళ్ల లోపు 22,817 మంది చిన్నారులు ఆటపాటలతో కూడిన విద్యను నేర్చుకుంటున్నారు. కానీ చిన్నారుల హాజరు పూర్తి స్థాయిలో నమోదు కావడం లేదు. హాజరు శాతం సగటున 72 శాతం నమోదు అవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గాను అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేచిన్నారుకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నూతనంగా అందించనున్న అల్పాహారం ద్వారా చిన్నారులు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపే అవకాశాలున్నాయి. ఈ మేరకు హాజరు శాతం పెరుగటంతో పాటు వారి శారీరక పెరుగుదల కూడా మెరుగుపడనుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ పథకం జిల్లాలోని వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే అవకాశాలున్నాయి.