బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ విడుదల
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:15 PM
మం డలంలోని బొమ్మరాజుపల్లి గ్రామంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పో స్టర్‌ను గుడిగానిపల్లి గ్రామంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆదివారం విడుదల చేశా రు.

ఊర్కొండ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : మం డలంలోని బొమ్మరాజుపల్లి గ్రామంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పో స్టర్‌ను గుడిగానిపల్లి గ్రామంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆదివారం విడుదల చేశా రు. ఈ నెల 29న ప్రారంభం కానున్న బ్రహ్మో త్సవాల సందర్భంగా ఆలయంలో చెన్నకేశవ స్వామికి గ్రామస్థులు అభిషేకం, లక్ష్మీఅష్టోత్తరం, విష్ణు సహస్ర నామపారాయణం వంటి పూజలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అనంత రం కొండపైకి స్వామివారు చేరుకుంటారని ని ర్వాహకులు తెలిపారు. మరుసటిరోజు కల్యాణో త్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ఫ గుడిగానిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు జంగ య్య ఇటీవల మృతి చెందగా, ఆదివారం ద శదిన కర్మ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆ గ్రా మానికి వెళ్లి, జంగ య్య చిత్రపటానికి పూ ల మాల వేసి నివాళ్లు అ ర్పించారు. బాధిత కు టుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలి పారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షుడు వెంకటయ్య గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మైనా రిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆది నారాయణ, నాయకులు జంగయ్య మాదిగ, వా టం రఘు, లోహిత్‌రెడ్డి, అయూబ్‌పాషా, ఆరిఫ్, మనోహర్ రెడ్డి ఉన్నారు.