BP Pandey: గోదావరి బోర్డు చైౖర్మన్‌గా బీపీ పాండే
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:52 AM
గోదావరి నది యాజమాన్య బోర్డు జీఆర్‌ఎంబీ చైౖర్మన్‌గా బన్సమణి ప్రసాద్ పాండే సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ..
కృష్ణా బోర్డు చైౖర్మన్‌గానూ అదనపు బాధ్యతలు
గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైౖర్మన్‌గా బన్సమణి ప్రసాద్ పాండే సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బీపీ పాండేకు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైౖర్మన్‌గానూ పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా పనిచేస్తున్న అతుల్‌కుమార్ జైన్ కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైౖర్మన్‌గా నియమితులైన విషయం విదితమే. కొన్ని రోజులుగా ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు బీపీ పాండేకు అప్పగించడంతో రెండు బోర్డులకు సంయుక్త చైౖర్మన్‌గా పాండే బాధ్యతలు చూడనున్నారు. సోమవారం బీపీ పాండేను ఈఎన్‌సీ (జనరల్) మహ్మద్ అంజద్ హుస్సేన్ కలుసుకొని... శుభాకాంక్షలు తెలిపారు.