kumaram bheem asifabad- నిధుల్లేక నీరసం
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:17 PM
గామ్ర పంచాయతీల్లో పాలకవర్గం లేక పోవడంతో నిధులు మంజూరు కాక పనులు ముందుకు సాగడం లేదు. గత ఏడాది జనవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల్లో ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు ఉంటే మాత్రమే వచ్చే నిధులు ఎప్పుడో నిలిచిపోయాయి. నిధులు లేక కనీస అవసరాలు తీరకపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడింది.
- పాలకవర్గాలు కొలువుదీరితేనే ఆర్థిక సంఘం నిధులు
జైనూర్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): గామ్ర పంచాయతీల్లో పాలకవర్గం లేక పోవడంతో నిధులు మంజూరు కాక పనులు ముందుకు సాగడం లేదు. గత ఏడాది జనవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల్లో ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు ఉంటే మాత్రమే వచ్చే నిధులు ఎప్పుడో నిలిచిపోయాయి. నిధులు లేక కనీస అవసరాలు తీరకపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడింది. సొంత డబ్బు ఖర్చు చేయలేక, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సీజన్‌లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. దీనికి పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకం. నిధులు లేక పోవడంతో పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. పాలకవర్గాలు ఉన్న సమయంలో నిధులు రావడం ఆలస్యమైనా సర్పంచ్‌లు ముందుగా సొంత డబ్బు ఖర్చు చేసి తర్వాత తీసుకునే వారు. ఇప్పడా పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో పంచాయతీ నిర్వహణ తమ వల్ల కాదని కార్యదర్శులు ఇప్పటికే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తగిన చర్యలు తీసుకోవాలిన కోరుతున్నారు.
పంచాయతీలకు నిలిచిన నిధులు..
బిసె భరత్, గ్రామ కార్యదర్శి
పంచాయతీలకు ఏడాదిన్నరకాలంగా నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో పను లు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే కొంత సొంత డబ్బులు పంచాయతీల కు ఖర్చు చేశాం. అవి ఇప్పటికీ రికవరీ కావడం లేదు.
నిధులు లేక అవస్థలు..
వినోద్, గ్రామ కార్యదర్శి
గ్రామ పంచాయతీలలో నిధులు లేనందున నిర్వహణ భారంగా మారింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినప్పటి నుంచి నిధులు పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో వీధి దీ పా లు, మంచినీటి నిర్వహణకు సైతం ఇబ్బందులు పడుతున్నాం.