Mallu Swarajyam: మల్లు స్వరాజ్యం ది ఫైర్ ఆఫ్ డిఫాయిన్స్ పుస్తకావిష్కరణ
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:40 AM
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనే కాక సమసమాజ నిర్మాణం లక్ష్యంగా జీవితమంతా పోరాడిన అలుపెరుగని...
హైదరాబాద్ సిటీ, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనే కాక సమసమాజ నిర్మాణం లక్ష్యంగా జీవితమంతా పోరాడిన అలుపెరుగని యోధ మల్లు స్వరాజ్యమని ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్. పుణ్యవతి కొనియాడారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ‘‘మల్లు స్వరాజ్యం-ది ఫైర్ ఆఫ్ డిఫాయిన్స్’’ ఆంగ్ల పుస్తకాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమె ఆవిష్కరించారు. ఆస్తిలో మహిళల వాటా హక్కు సాధనలో మల్లు స్వరాజ్యం పోరాటం నిరుపమానమైనదని పుణ్యవతి చెప్పారు. భూమిక ఉమెన్స్ కలెక్టివ్ కొండవీటి సత్యవతి పుస్తక పరిచయం చేశారు. అన్యాయంపై రాజీలేని పోరు సలిపిన సాహసి మల్లు స్వరాజ్యం జీవితాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలని సీపీఎం నాయకురాలు టి. జ్యోతి సూచించారు. ప్రజా ఉద్యమాల్లో పని చేస్తున్న వారికి ఆమె జీవితం ఓ నిఘంటువులాంటిదని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మల్లు స్వరాజ్యం కోడలు లక్ష్మి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నిర్వాహకురాలు గీతారామస్వామి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రతినిధి ఆశాలత తదితరులు పాల్గొన్నారు.