Share News

kumaram bheem asifabad- బోగస్‌ జాబ్‌కార్డులు తొలగించాలి

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:10 PM

ఉపాధి హామీలో బోగస్‌ జాబ్‌కార్డులు తొలగించాలని డీఆర్‌డీవో పీడీ దత్తారావును తనిఖీ అధికారులు ఆదేశించారు. మండల కేంద్రలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ ప్రజావేదిక శుక్రవారం నిర్వహించారు. ఉపాధిహామీ పథకంలో మండల వ్యాప్తంగా 1 ఏప్రిల్‌ 2024 నుంచి 31.02.25 వరకు 513 పనులు నిర్వహించారు.

kumaram bheem asifabad- బోగస్‌ జాబ్‌కార్డులు తొలగించాలి
ప్రజావేదికలో పాల్గొన్న అధికారులు

కెరమెరి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీలో బోగస్‌ జాబ్‌కార్డులు తొలగించాలని డీఆర్‌డీవో పీడీ దత్తారావును తనిఖీ అధికారులు ఆదేశించారు. మండల కేంద్రలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ ప్రజావేదిక శుక్రవారం నిర్వహించారు. ఉపాధిహామీ పథకంలో మండల వ్యాప్తంగా 1 ఏప్రిల్‌ 2024 నుంచి 31.02.25 వరకు 513 పనులు నిర్వహించారు. అందుకు గాను రూ.9.70 కోట్ల నిధులను కేటాయించారు. ఈ సందర్భంగా అట్టి పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందం ఈ నెల 16 నుంచి 26 వరకు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షిం చారు. కాగా శుక్రవారం ప్రజావేదిక నిర్వహించారు. మొత్తం 31 గ్రా పంచాయతీల్లో పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పనుల్లో చాలా గ్రామాల్లో బోగస్‌ జాబ్‌కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డీఆర్‌డీవో పీడీ దత్తారావును ఆదేశించారు. అలాగే ఉపాధి హామి పనుల్లో స్థానిక ఎఫ్‌ఏలు, మేట్లతో కలిసి వారి కుటుంబ సభ్యుల పేరిట జాబ్‌ కార్డులు సృష్టించి డబ్బులు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని గ్రామాల్లో గ్రామ కార్యదర్శుల సంతకాలు లేకుండా జాబ్‌ కార్డులు సృష్టించినట్లు ప్రజావేదికలో వెలుగు చూశాయి. కేస్లాగూడ గ్రామ పంచాయతీలో నిబందనలకు విరుద్ధంగా జాబ్‌ కార్డులు సృషించారన్నారు. కాగా సాయంత్రం 7 గంటల వరకు 20 గ్రామపంచాయతీలకు సంబంఽధించిన ఆడిట్‌ పూర్తి కాగా మరిగితా 11 గ్రామ పంచాయతీల ఆడిట్‌ కొనసాగుతోంది. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారాం, సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ నిర్మల, ఎస్‌ఆర్పీ రవియాదవ్‌, ఎంపీడీవో అంజద్‌పాషా, డీవీఓ ఆంజనేయులు, హెచ్‌ఆర్‌ అకౌంటెంట్‌ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:10 PM