Share News

BMS demands GST: బీడీలపై జీఎస్టీ తగ్గించాలి

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:09 AM

బీడీలపై ఉన్న జీఎస్టీని 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌...

BMS demands GST: బీడీలపై జీఎస్టీ తగ్గించాలి

న్యూఢిల్లీ, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): బీడీలపై ఉన్న జీఎస్టీని 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌(బీఎంఎస్‌), దాని అనుబంధ సంస్థ అయిన తెలంగాణ స్టేట్‌ బీడీ కార్మిక సంఘ్‌ డిమాండ్‌ చేశాయి. ఈ సంఘాల ప్రతినిధులు కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్యను ఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. బీడీలపై జీఎస్టీని 40 శాతనికి పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తమకు తెలిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. 40ు పెంచితే దేశంలోని 2 కోట్ల మంది బీడీ కార్మికులు, తెలంగాణలోని 10 లక్షలమంది బీడీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 04:09 AM