రక్తదానం మహత్తర సేవ
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:11 PM
రక్తదా నం మహాత్తర సేవ అని జిల్లా వైద్యారోగ్య శాఖ అధి కారి డాక్టర్ రవికుమార్ అ న్నారు.
- జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్
కందనూలు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : రక్తదా నం మహాత్తర సేవ అని జిల్లా వైద్యారోగ్య శాఖ అధి కారి డాక్టర్ రవికుమార్ అ న్నారు. నాగర్‌కర్నూల్ జి ల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆ ధ్వర్యంలో జాతీయ రక్తదాన దినోత్సవాన్ని జిల్లా పరిషత్ (పాత కలెక్టరేట్) ఆవరణలో ఘనంగా నిర్వహించారు. రక్తదాతలను డీఎంహెచ్‌వో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ రక్త దానం ఒక మహత్తరమైన మానవతా సేవ అన్నారు. రక్తం తయారు చేయలేనిదని, అవసర మైన సమయంలో రక్తం ఇచ్చే వారే నిజమైన దేవుళ్లని పేర్కొన్నారు. జిల్లాలో రక్తం కొరత రాకుండా అందరూ సహకరించాలని కో రారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ సెక్రటరీ రమే ష్‌రెడ్డి, యూత్ రెడ్‌క్రాస్ జిల్లా కన్వీనర్ కుమా ర్, సభ్యులు సురేష్, వైద్య సిబ్బంది, రక్తదాతలు మహేందర్, సురేందర్, బుచ్చయ్య పాల్గొన్నారు.