Share News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే గెలుపు

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:27 PM

రాబోవు స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బీజేపీ గెలుపుఖాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునా థ్‌రావు అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
దొనబండలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్‌్‌రావు

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు

హాజీపూర్‌, సెప్టెంబరు28 (ఆంఽధ్రజ్యోతి): రాబోవు స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బీజేపీ గెలుపుఖాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునా థ్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని దొనబండలో మాజీ వైస్‌ ఎంపీ పీ బేతు రమాదేవి రవిల ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరికల సందర్భంగా ఏ ర్పాటు చేసిన సమావేశంలో రఘునాథ్‌రావు మాట్లాడుతూ ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు దేశ వ్యాప్తంగా హర్షిస్తున్నా రని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చిత్తశుద్ధిలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు ఆ పార్టీకి సం బంధించిన వ్యక్తులతోనే కేసులు వేయిస్తున్నారన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గడ్డం స్వామి, ముఖేశ్‌గౌడ్‌, క్రిష్ణమూర్తి, వెంకటేశ్వర్‌ రా వు, అశ్విన్‌, ప్రశాంత్‌, వెంకటకృష్ణ, కమలాకర్‌రావు, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:27 PM