స్థానిక సంస్థల్లో బీజేపీదే విజయం
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:42 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంటేశ్వర్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోది ప్రవేశ పెట్టిన పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయన్నారు. మం డల పార్టీ అధ్యక్షుడు అంగళి శేఖర్ అధ్యక్షతన నెన్నెల, కన్నెపల్లి, భీ మి ని మండలాల నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల స న్నాహక సమావేశాన్ని సోమవారం నందులపల్లిలో నిర్వహించారు.
-జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్
నెన్నెల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంటేశ్వర్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోది ప్రవేశ పెట్టిన పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయన్నారు. మం డల పార్టీ అధ్యక్షుడు అంగళి శేఖర్ అధ్యక్షతన నెన్నెల, కన్నెపల్లి, భీ మి ని మండలాల నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల స న్నాహక సమావేశాన్ని సోమవారం నందులపల్లిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్ర భుత్వం సవరించిన జీఏస్టీ ప్రయోజనాలు త్వరలోనే సామాన్య ప్రజల కు చేరుతాయన్నారు. నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల్లో గె లు పే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఆవడం గ్రామానికి చెందిన సం తోషం రామ్‌చందర్, చిత్తాపూర్‌కు చెందిన జంబి లస్మయ్య, కర్జీకి చెం దిన అన్నారపు తిరుపతి బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, జిల్లా ప్ర ధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు, భీమిని, కన్నెపల్లి మండలాల అధ్యక్షు లు కొంక సత్యనారాయణ, మైదం ఆశన్న, నాయకులు ఉదయశ్రీ, సం తోష్, శైలెందర్‌సింగ్, నల్ల రాజేందర్, మూడు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.