Share News

High Court: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం రేవంత్‌ సర్కారుకు చెంప పెట్టు

ABN , Publish Date - Sep 10 , 2025 | 03:40 AM

గ్రూప్‌-1 పరీక్ష పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు..

High Court: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం రేవంత్‌ సర్కారుకు చెంప పెట్టు

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 పరీక్ష పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని తాము మొదటి నుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి సర్కారు మొండిపట్టుకు పోయి వేలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడిందని విమర్శించారు. నోటిఫికేషన్‌ విడుదల నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం వరకు అన్నీ తప్పుడు విధానాలనే టీజీపీఎస్సీ అవలంబించిందని ఆరోపించారు. అభ్యర్థుల విజ్ఞప్తులను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 03:40 AM