BJP state president Ranchander Rao: 7న ప్రజా వంచన దినం
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:55 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 7న నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవానికి వ్యతిరేకంగా అదే రోజు తెలంగాణ ప్రజా వంచన దినం...
ఇందిరా పార్కు వద్ద మహాధర్నా
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం: రాంచందర్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 7న నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవానికి వ్యతిరేకంగా అదే రోజు ‘తెలంగాణ ప్రజా వంచన దినం’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు, హాస్టళ్లను నిర్వహించలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. యూనివర్సిటీలు మూతపడే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దీనిని ప్రశ్నిస్తే కేంద్రాన్ని నిందిస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు రావాలని సినీ నటుడు శుభలేఖ సుధాకర్.. రాంచందర్‌రావును ఆహ్వానించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన సుధాకర్.. రాంచందర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు.