Ramachandra Rao: మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:33 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసే తమ అభ్యర్థిని మూడు రోజుల్లో ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు.....
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసే తమ అభ్యర్థిని మూడు రోజుల్లో ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సెగ్మెంటు టికెట్‌కు పోటీ ఉందన్న ఆయన గట్టి అభ్యర్థి కోసం అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పి.రాములు, సీనియర్ నాయకుడు కోమల ఆంజనేయులుతో కూడిన త్రిసభ్య కమిటీ అభిప్రాయ సేకరణ చేపట్టిందని, అనంతరం పార్టీ ఎన్నికల కమిటీ అభ్యర్థిని ఖరారు చేస్తుందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తాము గెలుచుకుని తీరుతామన్న ధీమా వ్యక్తం చేశారు.