Share News

స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేయాలి

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:33 PM

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎంపీ పోతుగం టి రాములు అన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేయాలి
మాట్లాడుతున్న మాజీ ఎంపీ పోతుగంటి రాములు

- మాజీ ఎంపీ రాములు

ఉప్పునుంతల, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎంపీ పోతుగం టి రాములు అన్నారు. బుధ వారం ఉప్పునుంతలలో పార్టీ మండల అధ్యక్షుడు మహేష్‌ అధ్యక్షతన కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ధైర్యంగా పని చేస్తే ఎల్లవేళలా పార్టీ తోడుగా ఉంటుదని అన్నారు. ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ కార్యక్ర మాలను ప్రజల్లో తీసుకెళ్లాలని జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి, నాయకులు రమేష్‌, సైదుల్‌ యాదయ్‌, శ్రీనునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:33 PM