kumaram bheem asifabad- బీజేపీ బలోపేతానికి పాటుపడాలి
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:50 PM
బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు పాటుపడాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. రెబ్బెన మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు పలువురు ఆదివారం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు
కాగజ్‌నగర్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు పాటుపడాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. రెబ్బెన మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు పలువురు ఆదివారం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమాల పథకాలు నిరుపేదలకు లభ్ది చేకూర్చుతున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేందుకు కార్యకర్తలు పాటుపడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దీటుగా బీజేపీ బలపరిచే అభ్యర్థులను బరిలోకి దింపుతామని చెప్పారు. స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న స్వచ్ఛంద సంస్థ నాయకులను, కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. దీంతో పార్టీని మరింత బలోపేతం చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీశైలం, బొడ్డుమౌనిక, మల్లేష్, బొడ్డు రాజ్‌కుమార్, ఇగురపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రాజారాంతో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ బలోపేతానికి పాటుపడాలని వారు సూచించారు.