BJP MP Arvind Dharmapuri: బొంతు రామ్మోహన్‌కు టికెటిస్తే బాగుంటుంది
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:23 AM
జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ టిక్కెట్టును కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు ఇస్తే బాగుంటుందని బీజేపీ..
బీజేపీ నాయకత్వానికి ఎంపీ అర్వింద్ ప్రతిపాదన
బీజేపీ అంతర్గత చర్చతో సంబంధం లేదన్న బొంతు
హైదరాబాద్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ టిక్కెట్టును కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు ఇస్తే బాగుంటుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ప్రతిపాదన చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావును కలుసుకున్న ఆయన బొంతు రామ్మోహన్‌కు ఏబీవీపీ నేపథ్యం ఉందన్నారు. అయితే ఉప ఎన్నికలో ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై త్రిసభ్య కమిటీ తన నివేదికను ఇప్పటికే అందజేసింది. టిక్కెట్టు ఆశిస్తున్న ఐదుగురు ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు స్థానిక నాయకుల నుంచి కమిటీ అభిప్రాయ సేకరణ చేసింది. వీరిలో ముగ్గురి పేర్లను జాతీయ నాయకత్వానికి నివేదించినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంపై నేడో, రేపో అధికారిక ప్రకటన రానుంది. ఈ తరుణంలో అర్వింద్ తాజా ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రె్‌సలో సంతృప్తిగా ఉన్నా: బొంతు రామ్మోహన్
మరోవైపు బీజేపీలో జరిగిన అంతర్గత చర్చతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. తాను బీజేపీ నుంచి పోటీ చేస్తాననడం వాస్తవం కాదన్నారు. తాను కాంగ్రె్‌సలో సంతృప్తిగా ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు.