కులమతాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ
ABN , Publish Date - Apr 19 , 2025 | 10:28 PM
అభివృద్ధి సంక్షేమాన్ని మరిచి కులమతాల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ పని అని మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.
డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
మంచిర్యాలక్రైం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి సంక్షేమాన్ని మరిచి కులమతాల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ పని అని మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. జైబాపు, జైభీం, జైసవిధాన్ కార్యక్రమంలో భాగంగాచివరి రోజు హాజీపూర్ నుంచి గడ్‌పూర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కోఆర్డినేటర్లు, నాయకులు, తదిలరులు పాల్గొన్నారు.
నస్పూర్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమకూర్చి రాసిన రాజ్యాంగం వల్లనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నా రు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో నస్పూర్‌లో 18,19,20, 21 వార్డుల్లో శనివారం సాయంత్రం పాదయాత్ర నిర్వహించారు. సీసీసీ కార్నర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు, మాజీ కౌన్సిలర్ కోడూరి లహారి విజయ్, వార్డుల ఇన్‌చార్జిలు సంపత్ రెడ్డి, ధర్ని మధుకర్, పట్టణ ఇన్‌చార్జి రమేష్, కో అర్డినేటర్ అంకతి శ్రీనివాస్, నాయకులు, పాల్గొన్నారు.