ఉచిత బియ్యం ఇస్తున్నది బీజేపీ ప్రభుత్వం
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:31 PM
తాడూరు మండలంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది బీజేపీ ప్రభుత్వమని పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు అన్నారు.
- నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు
తాడూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : తాడూరు మండలంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది బీజేపీ ప్రభుత్వమని పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ బీజేపీ అనే కార్యక్రమాన్ని పార్టీ మం డల అధ్యక్షుక చిలుక సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా మారి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ గ్రామపంచాయతీల్లో బీజేపీ జెండాను ఎగురవేయాలని దిశా నిర్దేశం చేశారు. పేద ప్రజలకు ప్రతీనెల ఉచిత బియ్యం, భూమి ఉన్న ప్రతీ రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 2వేల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీ నియర్ నాయకులు, జడ్పీ టీసీ, ఎంపీటీసీ ఎన్నికల తాడూరు మండల ఇన్ చార్జి నాగేందర్‌గౌడ్, బీజే పీ యువ మోర్చా జిల్లా కార్యదర్శి ధన్నోజు నరేష్ చారి, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌గౌడ్, మండల సెక్రటరీ బాలస్వా మి, అనంత రాములు, మస్తాన్, తాడూరు గ్రామ నాయకులు చందు, వివిధ గ్రామాల నాయకులు నాగయ్యగౌడ్, చెన్న చంద్రయ్య, కృష్ణ, పరశురాములు పాల్గొన్నారు.
ఫ వంగూరు : బీజేపీ నాగర్‌కర్నూల్ పార్ల మెంట్ నియోకవర్గ ఇన్‌చార్జి పోతుగంటి భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని రంగాపూర్‌లో ఓటర్ చైతన్యం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలో పేతం చేసేందుకు కార్యక ర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్ర మంలో మండల పార్టి అద్యక్షుడు ఆనంద్‌రెడ్డి, సైదులు, రామకృష్ణారెడ్డి, లక్ష్మయ్య, నవీణ్‌రెడ్డి, మల్లేష్‌గౌడ్, రాఘవేందర్, నరేందర్, భీమయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఫ కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మొగిలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ లో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను అమలుపర్చాలని డిమాండ్ చేశారు.