Share News

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:33 PM

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావ డం ఖాయమని మహబూ బ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అ న్నారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం
ఊర్కొండలో హైమాస్ట్‌ లైట్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ డీకే అరుణ

- మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

ఊర్కొండ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి)ః తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావ డం ఖాయమని మహబూ బ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అ న్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు ముచ్చర్లపల్లి, రాంరెడ్డిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారం భోత్సవంతో పాటు హైమాస్ట్‌ లైట్‌ ప్రారంభిం చారు. ముచ్చర్లపల్లిలో ఆలయం పరిసరాల్లో మొక్కలు నాటారు. అదేవిధంగా రాంరెడ్డిపల్లి గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పా టు చేసిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుదా మని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చే యకుండా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను నట్టెట ముంచిందని విమర్శించారు. వారి వెంట సీనియర్‌ నాయకులు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్‌, నాయకులు పరశురాములు ఉన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:33 PM