Share News

ఇండ్ల పట్టాల కోసం కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ ధర్నా

ABN , Publish Date - May 30 , 2025 | 11:32 PM

నస్పూర్‌ పట్టణంలోని సింగరేణి స్థలా ల్లో చాలా కాలంగా నివాసం ఉంటున్న వారందరికి శాశ్వత ఇండ్ల పట్టాలను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నస్పూర్‌ లోని కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.

ఇండ్ల పట్టాల కోసం కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ ధర్నా
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

నస్పూర్‌, మే 30 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్‌ పట్టణంలోని సింగరేణి స్థలా ల్లో చాలా కాలంగా నివాసం ఉంటున్న వారందరికి శాశ్వత ఇండ్ల పట్టాలను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నస్పూర్‌ లోని కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అంతకు ముందు ప్రధాన రహదారి కమాన్‌ వద్ద నుంచి ఊరేగింపుగా కలెక్టరేట్‌ ప్రధాన ద్వా రం వరకు చేరుకున్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, మాజీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్‌ మాట్లాడు తూ చాలా కాలంగా సింగరేణి స్థలాల్లో ఇండ్లను నిర్మించుకొని నివాసముం టున్నారని, వారందరికి ఇళ్ల పట్టాలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేద ప్ర జలకు శాశ్వత పట్టాలను ఇవ్వాలన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఇప్పు డు కాంగ్రె స్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇళ్ల పట్టాలు ఇస్తామని హా మీలు గుప్పించి పేద ప్రజలు మోసం చేస్తున్నారన్నారు. వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందో ళనలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం, క్రిష్ణమూర్తి, కమలాకర్‌రావు, సామ్రాజ్‌ రమే శ్‌, సత్రం రమేష్‌, రవనవేని శ్రీనివాస్‌, పొన్నవేని సదానందం,, మిట్టపల్లి మొ గిలి, చక్రి, విక్రం, శ్రీకాంత్‌, అశ్విన్‌, రాజుకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:32 PM