N Ranchandra Rao: గ్రూప్-1 పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:21 AM
గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యువతకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూస్తున్నారని, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆమరణ దీక్షకు దిగకముందే ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలన్నారు. ఈ మేరకు శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వానికి రాంచందర్‌రావు విజ్ణప్తి చేశారు.