BJP state president N. Ramchander Rao: చట్టం తెచ్చిందీ మీరే.. ఉల్లంఘిస్తోందీ మీరే
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:26 AM
పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రె్‌సకు చెందినవారమని చెబు తూ.. స్పీకర్ ముందు మాత్రం తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్పడం పూర్తిగా విలువల్లేని రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు విమర్శించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నామంటున్నారు: రాంచందర్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రె్‌సకు చెందినవారమని చెబు తూ.. స్పీకర్ ముందు మాత్రం తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్పడం పూర్తిగా విలువల్లేని రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు విమర్శించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. ప్రస్తుతం కాంగ్రె్‌సలో ఉన్నారా, బీఆర్‌ఎ్‌సలో ఉన్నారా అనేదానిపై స్పష్టత లేకపోవడం సర్కారు దౌర్భాగ్యమన్నారు. తెలంగాణ రాజకీయాల్లో విలువలు క్షీణించే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత బీఆర్‌ఎ్‌సకే దక్కుతుందని ఆరోపించారు. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. గతంలో ఫిరాయింపులను అరికట్టేందుకు ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని తెచ్చినకాంగ్రెస్సే ఇప్పుడు ఆ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే .. ఆ పార్టీతో ఎంఐఎం అంటకాగుతుందన్నారు. గ్రామ పంచాయతీలకు రూ.3,000 కోట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఆ నిధులు కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని ఆయన తెలిపారు.