Share News

BJP president Ramchandra Rao: అసెంబ్లీలో బలమైన స్వరం వినిపించండి

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:55 AM

అసెంబ్లీలో బలమైన స్వరం వినిపించాలని, సర్కారు వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు...

BJP president Ramchandra Rao: అసెంబ్లీలో బలమైన స్వరం వినిపించండి

  • బీజేపీ ఎమ్మెల్యేలకురాంచందర్‌రావు దిశానిర్దేశం

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో బలమైన స్వరం వినిపించాలని, సర్కారు వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. బలమైన ప్రజాపక్షంగా నిలబడి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాంచందర్‌రావు కీలక భేటీ నిర్వహించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానాలు రాబట్టే విధంగా బీజేపీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. సభలో సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రభావవంతంగా లేవనెత్తాలని సభ్యులకు రాంచందర్‌రావు సూచించారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సమావేశానికి రాని ఎమ్మెల్యేలకు ఆయన ఫోన్‌ చేసి పార్టీ ఉద్దేశాలను వివరించారు.

Updated Date - Dec 29 , 2025 | 01:55 AM