Share News

BJP Telangana president Ramchander Rao: మజ్లిస్‌ కోసమే జీహెచ్‌ఎంసీ విస్తరణ

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:14 AM

జీహెచ్‌ఎంసీలో ఒక ప్రాంతాన్ని మజ్లిస్‌ పార్టీకి ధారాదత్తం చేయడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం మునిసిపాలిటీల విలీనాన్ని తెరపైకి తెచ్చిందని..

BJP Telangana president Ramchander Rao: మజ్లిస్‌ కోసమే జీహెచ్‌ఎంసీ విస్తరణ

  • ఇప్పటికే కార్పొరేషన్‌లో నిధుల కొరత విలీనంతో పల్లెలకు నష్టం: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీలో ఒక ప్రాంతాన్ని మజ్లిస్‌ పార్టీకి ధారాదత్తం చేయడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం మునిసిపాలిటీల విలీనాన్ని తెరపైకి తెచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. మజ్లిస్‌ నేతల ఒత్తిళ్ల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. తక్షణం దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇలాగే తుగ్లక్‌ పని చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం పూర్తిగా అశాస్త్రీయమని అన్నారు. జీహెచ్‌ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలతో శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు సమావేశం నిర్వహించారు. 20 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీన పర్యవసానాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏడాది కిందటే కొన్ని గ్రామాలను సంబంధిత మునిసిపాలిటీల్లో కలిపారు. ఇప్పుడు వాటిని జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంత వాసులపై పన్నుల భారం పెరుగుతుంది’’ అని అన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 04:14 AM