BJP OBC Morcha national president K Laxman: బీసీలపై రేవంత్ మొసలి కన్నీరు
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:16 AM
బీసీల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు...
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): బీసీల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. బీసీలకు 42ు మంత్రి పదవులు, బీసీ సబ్-ప్లాన్‌కు చట్టబద్ధత ఇవ్వడానికి ఏ కోర్టు అడ్డుపడిందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బూటకపు హామీలిచ్చారని విమర్శించారు. మహాత్మా జ్యోతిబాఫూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో 42ు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు మోసమని తేలిపోయిందని ఆరోపించారు.