kumaram bheem asifabad- పెద్దపులి అలజడి
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:21 PM
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో మళ్లీ పెద్ద పులి గర్జిస్తోంది. దీంతో పల్లెల్ల్లో భయాందోళన మొదలైంది. నవంబరు నుంచి జనవరి వరకు పులులు జతకట్టే సమయం. ఆ సమయంలో వాటి సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈసారి మాత్రం అక్టోబరులోనే పులుల సంచారం కనిపిస్తోంది. వారం వ్యవధిలోనే రెండు చోట్ల పశువులపై దాడులు చేశాయి. అటవీశాఖ అధికార యంత్రాంగం అప్రమత్త మైంది. అటవీ సమీప గ్రామాల్లో డప్పు చాటింపుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
- అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు
- పులి పాదముద్రల గుర్తింపు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆసిఫాబాద్, ఆక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో మళ్లీ పెద్ద పులి గర్జిస్తోంది. దీంతో పల్లెల్ల్లో భయాందోళన మొదలైంది. నవంబరు నుంచి జనవరి వరకు పులులు జతకట్టే సమయం. ఆ సమయంలో వాటి సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈసారి మాత్రం అక్టోబరులోనే పులుల సంచారం కనిపిస్తోంది. వారం వ్యవధిలోనే రెండు చోట్ల పశువులపై దాడులు చేశాయి. అటవీశాఖ అధికార యంత్రాంగం అప్రమత్త మైంది. అటవీ సమీప గ్రామాల్లో డప్పు చాటింపుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో సాధారణంగా ఏటా నవంబరు నుంచి జనవరి వరకు పులి సంచారం ఎక్కువగా ఉంటుంది. పులులు జతకట్టే సమయం కావడంతో మహారాష్ట్ర నుంచి పులుల రాకపోకలు పెరుగుతుంటాయి. జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటాయి. గతంలో ఇదే సీజన్‌లో పులులు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. నాలుగైదు ఏళ్లుగా పశువులపై దాడులు పెరిగాయి. అదే సమయంలో పత్తి చేలల్లో పని చేస్తున్న వ్యవసాయ కూలీలపై కూడా పులులు దాడి చేశాయి. పులుల దాడిలో పలువురు మృతి చెందారు. గత ఏడాది నవంబరు 28న కాగజ్‌నగర్ మండలం లోని నజ్రూల్‌నగర్‌లో పత్తి ఏరుతున్న మోహర్లే లక్ష్మిపై పులి దాడి చేసి చంపింది. సిర్పూర్(టి) మండలంలోని దుబ్బగూడ గ్రామంలో పత్తి చేలలో ప త్తి ఏరుతున్న రైతు సురేష్ పై దాడి చేసి గాయపరి చింది.
ఫ కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో..
కాగజ్‌నగర్ డివిజన్‌లో ఇటీవల రెండు చోట్ల పశువు లపై పులులు దాడులు చేశాయి. సిర్పూర్(టి) మండ లం చీలపెల్లిలో అక్టోబరు 3న ఎల్పుల తిరుపతికి చెందిన లేగదూడపై పులి దాడి చేయడంతో మృత్యు వాత పడింది. అక్టోబరు 10న నవేగాం గ్రామంలో శివరాంకు చెందిన ఎద్దుపై పులిదాడి చేసి చంపేసింది. ఈనెల 13న దహెగాం మండలం బిబ్రా అటవీ ప్రాంతంలో పులి పాద ముద్రలను అదికారులు గుర్తించారు. పులుల సంచారంపై అటవీ సమీప గ్రామ ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో పులుల సంచారం పెరి గిన నేపథ్యంలో అటవీ అధికారులు అప్రమత్తమయ్యా రు. పులి సంచారం ఏ ప్రాంతంలో ఉందన్న విషయాన్ని ట్రాక్ చేస్తున్నారు. పులి సంచారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇదే సమయంలో పులి వల్ల మనుషులకు, పశువులకు ఎలాంటి హనీ జరుగకుండా చర్యలు తీసుకుంటున్నా రు. సిర్పూర్(టి) మండలం మాకిడి, చిలపల్లి, కాగజ్‌నగర్‌లోని పెద్దరాస్‌పల్లి, సార్‌సాల, అనుకొడ, దహెగాం మండలంలోని బీబ్రా, మురళీగూడ తదితర ప్రాంతాల్లో డప్పు చాటింపులు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు పత్తి ఏరే సమయం కావడంతో రైతులు వ్యవసాయ కూలీలు చేలలోకి వెళ్ల తప్పని పరిస్థితి. పులుల సంచారం కూడా పెరుగుతుండడంతో రైతులు ఆందోళనకు గుర వుతున్నారు. పశువుల కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని, అటవీ పరిసర ప్రాంత ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.