kumaram bheem asifabad- ఘనంగా బోనాలు
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:07 PM
జిల్లా కేంద్రంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున బోనాల పండగ నిర్వహించారు. ఉదయం నుంచి జిల్లా కేంద్రంలోని పోచమ్మ, మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున బోనాల పండగ నిర్వహించారు. ఉదయం నుంచి జిల్లా కేంద్రంలోని పోచమ్మ, మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కసబ్‌వాడిలోని పోచమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. భక్తులకు ఇబ్బందులు కాకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల, పోతరాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పోచమ్మ ఆలయంలో భక్తులు ఉదయం నుంచి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు. అలాగే డాడనగర్ రాంనగర్ వద్ద పోచమ్మ ఆలయంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనంతో వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలోని నల్ల పోచమ్మకు బోనాలు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. శివసత్తుల నృత్యాలతో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమాల్లో ిమాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కోనేరు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలంలో ఆదివారం ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. మండల కేంద్రంలోని కంకాలమ్మ బోనాల ప్రతి ఆషాఢ మాసం చివరి ఆదివారం నిర్వహించడం అనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం అంగరంగ వైభవంగా కంకలమ్మ బోనాలు నిర్వహఙంచారు. కన్నెపల్లి గ్రామంలో కూడా బోనాలు ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా మండల కేంద్రంలో శివసత్తులు బోనం ఎత్తుని భాజాభజంత్రీలతో నృత్యాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి బోనాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కనకయ్య, మౌనీష్, తిరుపతి, శైలజ, బాపు, రవీందర్‌గౌడ్, సంతోష్, ప్రభాకర్‌గౌడ్, శ్రీనివాస్, పాండురంగ తదితరులు పాల్గొన్నారు.