సమస్యల పరిష్కారానికి భూభారతి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:06 PM
భూ సమస్యలను పరిష్కరించి ఎటువంటి వివాదా లకు తావు లేకుండా ఉండేందుకే భూభారతీ చట్టా న్ని ప్రభుత్వం తీసుకవచ్చిందని కలెక్టర్ కుమార్ దీ పక్ అన్నారు. లక్షెట్టిపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటి యార్డ్‌లో గురువారం రైతు వేదికలో భూభా రతీ నూతన చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ ఆర్‌డీవో శ్రీనివాస్‌రావు హాజరై అవగాహన కల్పిం చారు.
కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి(లక్షెట్టిపేట)ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): భూ సమస్యలను పరిష్కరించి ఎటువంటి వివాదా లకు తావు లేకుండా ఉండేందుకే భూభారతీ చట్టా న్ని ప్రభుత్వం తీసుకవచ్చిందని కలెక్టర్ కుమార్ దీ పక్ అన్నారు. లక్షెట్టిపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటి యార్డ్‌లో గురువారం రైతు వేదికలో భూభా రతీ నూతన చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ ఆర్‌డీవో శ్రీనివాస్‌రావు హాజరై అవగాహన కల్పిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ స్థానం లో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతీ నూతన ఆర్‌వో ఆర్ చట్టం తీసుకవచ్చిందన్నారు. ఈచట్టంతో ఒకే రోజు రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పి స్తున్నట్లు ఆయన వివరించారు. రిజిస్ట్రేషన్ మ్యుటే షన్ సంబంధించిన భూమి సర్వే చేసి మ్యాప్ త యారు చేస్తారని పేర్కొన్నారు. తహసీల్దార్ ద్వారా భూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ చేస్తా రని తద్వారా నెలల తరబడి మ్యూటేషన్ కోసం తిర గడం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం ఉండద న్నారు. రికార్డుల్లో తప్పులు సవరణకు అవకాశం ఉంటుందన్నారు. పెండింగ్‌లో సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం కోసం ఈచట్టం ఎం తో ఉపయోగ పడుతుందన్నారు. వారసత్వంగా వ చ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేపట్టి భూమి హక్కులు ఏవిధంగా సంక్రమించినా, ముటేషన్ చేసి రికార్డులో నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక మండలాన్ని ఎంపిక చేసి మండలంలోని అన్ని రకాల సమస్యలను తెలుసుకోని నిర్ణీత గడువులో పరిష్కరిస్తామన్నారు. వచ్చేజూన్ నుంచి పూర్తి సా ్థయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తె లిపారు. అనంతరం లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మి స్తున్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల భవన ని ర్మాణ పనులను ఆయన పరిశీలించారు. విద్యారం గ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చే స్తుందన్నారు. ఈక్రమంలో నిర్మాణ పనులను వేగ వంతం చేసి నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ దీలిప్‌కుమార్, ఎంపిడివో సరోజ, నాయకులు, రైతులు, వివిధ శాఖ ల అధికారులు, సిబ్బంది ఉన్నారు.