సమస్యల పరిష్కారం కోసమే భూభారతి
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:36 PM
భూమి సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం ను ఏర్పాటు చేసిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభార తిపై ఏ ర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సుకు హాజరై ప్రసంగించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
జన్నారం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : భూమి సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం ను ఏర్పాటు చేసిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభార తిపై ఏ ర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సుకు హాజరై ప్రసంగించారు. గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు ప్రభు త్వం రూపొందించిన భూ భారతిలో వాటిని సరి చేసిందన్నారు. భూ భారతిలో రెవెన్యూ రికార్డులను సరిగ్గా మె యింటెన్ చేస్తారని, ప్రతి సంవత్సరం భూముల రికార్డుల ను తీసి ఆ ఫైళ్లను తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరు స్తామన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న భూభారతిలో సై తం ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కో రారు. భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లవచ్చని అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చని అ క్కడ కూడా న్యాయం జరక్కపోతే కలెక్టర్‌కు అప్పీలు చేసు కునే అవకాశం భూభారతిలో ఉందని తెలిపారు. గతంలో ధరణిలో లేని సాదా బైనామాలకు భూ భారతిలో ఆప్షన్ ఉందని రైతులు భూ సమస్యలపై కలెక్టర్ వరకు రాకుండా తహసీల్దార్ వద్దనే పరిష్కారమయ్యే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రా రంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతి లా ల్, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, ఏడీ శ్రీనివాస్, పొనకల్ పీఏసీఎస్ చైర్మన్ అల్లం రవి, తహసీ ల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఏపీఎం బుచ్చన్న, సీసీ నా గలక్ష్మీ, బుక్ కీపర్ శాంతి, వ్యవసాయాధికారులు, కేంద్రాల నిర్వహకులు పాల్గొన్నారు. ఏఈవోలు త్రిసంధ్య, అక్రమ్, కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి రైతులు పాల్గొన్నారు.