భూ భారతి వినతులకు పరిష్కారం చూపాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:15 PM
వివిధ భూ స మస్యల పరిష్కారానికి భూ భా రతిలో సమర్పించిన వినతుల కు సకాలంలో పరిష్కారం చూ పాలని ఆర్డీవో సురేష్‌కుమార్ ఆదేశించారు.
- ఆర్డీవో సురేష్ కుమార్
బిజినేపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : వివిధ భూ స మస్యల పరిష్కారానికి భూ భా రతిలో సమర్పించిన వినతుల కు సకాలంలో పరిష్కారం చూ పాలని ఆర్డీవో సురేష్‌కుమార్ ఆదేశించారు. మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయా న్ని గురువారం ఆయన ఆకస్మి క తనిఖీ చేసి రికార్డులను పరి శీలించి మాట్లాడారు. వివిధ స మస్యలతో కార్యాలయానికి వచ్చే రైతు లకు, విద్యార్థులకు, ప్రజలకు అవసరమైన సేవలను సకాలంలో అందించేలా అందుబాటు లో ఉండాలని అన్నారు. అనవసరంగా కుంటి సాకులు చెప్పి కాలయాపన చేయడంతో పాటు పదే పదే కార్యాలయం చుట్టూ తిప్పించుకో వద్దని హెచ్చరించారు. తహసీల్దార్ మునీరుద్దీ న్, నాయబ్ తహసీల్దార్ రవి కుమార్, ఆర్‌ఐలు బాలరాజు, భారతిబాయి, జూనియర్ అసిస్టెం ట్లు కృష్ణవేణి, అరుణ, మాధ వి, రాఘవేందర్, భగవంత్ సాగర్, రమేష్ ఉన్నారు.