భూ భారతి చట్టం.. రైతులకు వరం
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:18 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారం భించిన భూ భారతి చట్టం రైతులకు వరం లాంటిదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నూతన ఆర్‌వోఆర్ చట్టం ద్వారా భూ సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మండల కేంద్రంలోని రైతు వేధికలో శనివారం నిర్వహించిన భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నెన్నెల, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారం భించిన భూ భారతి చట్టం రైతులకు వరం లాంటిదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నూతన ఆర్‌వోఆర్ చట్టం ద్వారా భూ సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మండల కేంద్రంలోని రైతు వేధికలో శనివారం నిర్వహించిన భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కులపై ప్రతీ రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. రికార్డుల సవరణ, మ్యూటేషన్‌కు ముందే మ్యాప్ తయారు చేయడం, పాసు బుక్కులోనే భూమి పటం, భూ సమస్య పరిష్కారానికి అప్పీల్ విధానం తదితర నూతన అంశాలు ఉన్నాయన్నారు. పైలెట్ మండాల్లో జూన్ 2 వరకు, మిగతా మండలాల్లో ఆగస్టు 15 వరకు పూర్తి భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే అధికారుల నియామకాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. నూతన చట్టం విధి విధానాలను అధికారులు చదివి వినిపించారు. ప్రభుత్వ భూమిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అటవిశాఖ వారు ఇబ్బందుల పాలు చేస్తున్నారని స్థానిక నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెల్లగా జాయింట్ సర్వే చేసి సమస్యకు పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, బెల్లంపల్లి ఆర్‌డీవో హరికృష్ణ, ఏడీఏ సురేఖ, తహసిల్దార్ మహేంద్రనాథ్, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, ఏవో పుప్పాల సృజన, పీఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేష్, కాంగ్రెస్ నాయకులు బొమ్మెన హరీష్ తదితరులు పాల్గొన్నారు.