ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:19 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్ధిదారులతో కలిసి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి భూమిపూజ చేశారు.
- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి
బిజినేపల్లి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్ధిదారులతో కలిసి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి భూమిపూజ చేశారు. మండలంలోని బిజినేపల్లి తండా, ఎర్రకుంటతండా, లట్టుపల్లి, బోయపూర్, ఢాకుతండా, రావులచెరువు తండాల్లో బుధవా రం పార్టీ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసి మాట్లాడారు. సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు. ఆ యన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మార్కెట్ డైరెక్టర్ వాల్యానాయక్, అమృత్‌రెడ్డి, గంగనమోని తిరుపతయ్య, మాజీ జడ్పీటీసీ పరశురాములు, కృష్ణారెడ్డి, గోవింద్ నాయక్, చంద్రగౌడ్, కత్తె ఈశ్వర్, పండ్ల పాషా, ప్రేమ్‌లాల్, పూల్యానాయక్, కృష్ణనాయక్, గోపాల్ నాయక్, సైదులు తదితరులు ఉన్నారు.
ఇల్లు లేని ప్రతి లబ్ధిదారునికి ఇల్లు ఇస్తాం
తాడూరు : ఇల్లు లేని ప్రతీ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేం ద్రంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ముగ్గు పోసి పనలుఉ ప్రా రంభించారు. బుధవారం వరకు నాలుగెకరాల లోపు ఉన్న రైతులందరికీ రైతు భరోసా అందిస్తామన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి, ఎంపీడీవో ఆంజనే యులు, హౌసింగ్ ఏఈ, స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.