kumaram bheem asifabad- ఘనంగా భవాని జాతర
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:19 PM
వాంకిడి మండలంలోని సరండి గ్రామసమీపంలోని బోడ గుట్ట వద్ద ఆదివారం భవాని మాత జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామ సమీపంలోని బోడ గుట్టపైన గల ఎల్లమ్మను దర్శించుకునేందుకు వాంకిడి మండలం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
వాంకిడి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : వాంకిడి మండలంలోని సరండి గ్రామసమీపంలోని బోడ గుట్ట వద్ద ఆదివారం భవాని మాత జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామ సమీపంలోని బోడ గుట్టపైన గల ఎల్లమ్మను దర్శించుకునేందుకు వాంకిడి మండలం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి సంవత్సరం పొలాల అమవాస్య మరుసటి రోజున ఇక్కడ జాతర కొనసాగుతుంది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కిలోమీటరు గుట్టపైన గల ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. జాతరకు వచ్చే భక్తులకోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట్ ఆధర్యంలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ సత్యనారాయణ, ఎస్సై మహెందర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా బడగ వేడుకలు
ఆసిఫాబాద్/పెంచికలపేట ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ పట్టణంతో పాటు మండలంలో బడగ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పొలాల అమావాస్య మరుసటి రోజు గ్రామాల్లో బడుగ పర్వదినాన్ని జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఆదివాసీ గ్రామాల్లో గిరిజన సంప్రదాయ రితీలో బడుగ వేడుకలను నిర్వహించి ప్రత్యేక పూజలను చేపట్టారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. పెంచికలపేట మండలంలో బడుగ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పొలాల అమవాస్య మరుసటి రోజు గ్రామాల్లో జరుపుకోవటం అనవాయితీగా వస్తోంది. ఆదివాసీ గ్రామాల్లో యువకులు మరుగోళ్లపై వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసం ప్రారంభంలో వెదరుబొంగులతో తయారు చేసిన మరుగోళ్లపై నడువడం అనవాయితీగా వస్తోంది. బడుగ రోజు మరుగోళ్లను గ్రామ పొలిమేరల్లోని తుమ్మచెట్టు వద్దకు తీసుకెళ్లి నైవేద్యాలు సమర్పించి అక్కడే వదిలేస్తారు.