Bhatti Vikramarka Urges Victory: కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:46 AM
అన్ని వర్గాల అభివృద్ధి కోసం, పేదరికంలో ఉన్న వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు, వారిని ముందుకు నడిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని....
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌ను గెలిపించాలి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
శ్రీనగర్ కాలనీ/ఎ్‌సఆర్ నగర్, నవంబరు 8 (ఆంధ్ర జ్యోతి): అన్ని వర్గాల అభివృద్ధి కోసం, పేదరికంలో ఉన్న వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు, వారిని ముందుకు నడిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్జీతో గెలిపించాలని కోరుతూ క్రైస్తవ ప్రతినిధులు శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిందని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తోందన్నారు. ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడం కోసం వచ్చిన క్రైస్తవ సోదరులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నవీన్ గెలుపునకు ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజ హితం కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నదన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.