Bhatti Vikramarka Urges: మానవాళి ప్రేమ, ఆప్యాయతతో జీవించాలి
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:44 AM
మనుషులంతా ప్రేమ, ఆప్యాయతతో కలిసి మెలిసి జీవించాలని... ఏసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు..
బయ్యారంలో చర్చి క్రిస్మస్ వేడుకల్లో భట్టి విక్రమార్క
మధిర రూరల్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మనుషులంతా ప్రేమ, ఆప్యాయతతో కలిసి మెలిసి జీవించాలని... ఏసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం ఆర్‌సీఎం చర్చిలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా చర్చికి వచ్చి ప్రార్థనలు చేశానని గుర్తుచేసుకున్నారు. ఏసుక్రీస్తు మానవాళికి అందించిన త్యాగం, సేవాగుణాలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని, ఇతరుల కష్టాల్లో పాలుపంచుకోవడమే నిజమైన భక్తి అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని దేవుడిని ప్రార్థించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.