Share News

Bharat Future City: ఫ్యూచర్‌ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు

ABN , Publish Date - Dec 10 , 2025 | 03:52 AM

జాతీయ, అంతర్జాతీయ పెట్టుబుడులకు గమ్యస్థానంగా నిలిచేలా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ఓ ఆర్కిటెక్చరల్‌ అద్భుతంగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ....

Bharat Future City: ఫ్యూచర్‌ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు

  • 13,500 ఎకరాల్లో నిర్మితమయ్యే ఆ నగరం ఓ ఆర్కిటెక్చరల్‌ అద్భుతం.. 9 లక్షల మంది జనాభాకు ఆవాసాలు

  • యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి అనుబంధంగా లైఫ్‌ సైన్సెస్‌ వర్సిటీ

  • ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): జాతీయ, అంతర్జాతీయ పెట్టుబుడులకు గమ్యస్థానంగా నిలిచేలా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ఓ ఆర్కిటెక్చరల్‌ అద్భుతంగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. 13,500 ఎకరాల్లో ఆరు జోన్లుగా ఏర్పాటవ్వనున్న ఫ్యూచర్‌ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఆ నగరంలో 9 లక్షల మందికి ఆవాసం కల్పించబోతున్నామని తెలిపారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఫ్యూచర్‌ సిటీని కార్బన్‌ రహిత నగరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, యాజ్‌ ఏ మ్యాగ్నెట్‌ ఫర్‌ 3 ట్రిలియన్‌ డాలర్స్‌ తెలంగాణ’ అంశంపై మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడారు. ఏఐ, హెల్త్‌ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌, క్రీడలు, డేటా సెంటర్‌, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు అనే ఆరో జోన్లుగా ఫ్యూచర్‌ సిటీ ఉంటుందని వివరించారు. ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుతో ఫ్యూచర్‌సిటీలో 13 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 9 లక్షల మంది జనాభా నివాసానికి అనుగుణంగా గృహ నిర్మాణ సం’స్థలు నివాస సముదాయాలు అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ కార్యక్రమాలు మరో నెల రోజుల్లో ప్రారంభవుతాయని ప్రకటించారు. డేటా సెంటర్ల కోసం ఫ్యూచర్‌ సిటీలో కేటాయించిన 400 ఎకరాల్లో వచ్చే ఫిబ్రవరి నెలాఖరులో నిర్మాణాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ‘ సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ జీరో కార్బన్‌ సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా భాసిల్లుతుంది. ఇక్కడ కురిసే ప్రతీ చినుకు భూమిలో ఇంకిపోయేలా రెయిన్‌ హార్వెస్టింగ్‌ జరుగుతుంది. భూగర్భ జలాలకు కొదవ లేకుండా చేస్తాం. ఫ్యూచర్‌ సిటీలో లైఫ్‌ సైన్సెస్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల రంగాల్లో నూతన పరిశోధనలు, మ్యానుఫ్యాక్చరింగ్‌ కేంద్రాలు ఉంటాయి’’ అని శ్రీధర్‌ బాబు వివరించారు. ఇక, ‘‘జినోమ్‌ వ్యాలీ బియాండ్‌ యాక్సిలరేటింగ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఇండ్రస్టీస్‌’’ ప్యానెల్‌ చర్చలో మాట్లాడుతూ.. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి అనుబంధంగా లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం రూపొందిస్తోన్న లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2.0ను దావో్‌సలో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆవిష్కరిస్తామని ప్రకటించారు.

Updated Date - Dec 10 , 2025 | 03:53 AM