Bhantia Furnitures signed an MoU: భాంటియా పెట్టుబడులు 511 కోట్లు
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:16 AM
భాంటియా ఫర్నిచర్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం ఎంవోయూ కుదుర్చుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ రూ.511 కోట్ల పెట్టుబడులు....
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): భాంటియా ఫర్నిచర్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ రూ.511 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఒప్పందంతో 1,550 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో భాంటియా ప్రతినిధులు సురేందర్ భాంటియా, అమిత్ భాంటియా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భాంటియా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ఫర్నిచర్ రంగంలో వృద్ధి దిశను మార్చేందుకు, విస్తరణ మార్గాన్ని మెరుగుపరిచేందుకు కీలక అడుగు అని పేర్కొన్నారు.